Monday, December 23, 2024

ఆన్‌లైన్ పేకాటతో ఆర్థికంగా నష్టం… చైన్‌స్నాచర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః ఆన్‌లైన్‌లో పేకాడి డబ్బులు పోగొట్టుకుని, చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న యువకుడిని పోచంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బి నగర్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి డిఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. హయత్‌నగర్, చౌటుప్పల్ మండలం, గుండ్లబావి గ్రామానికి చెందిన చిడుగుల నరేష్ ఆర్‌టిఏ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు ఆన్‌లైలో పేకాట, క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పెట్టడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు.

తన బంధవుల వద్ద రూ. 20లక్షలు అప్పులు చేయడంతో వారి తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీనిని తట్టుకోలేక నిందితుడు సులభంగా డబ్బులు సంపాదించాలని చైన్‌స్నాచింగ్ చేయాలని ప్లాన్ వేశాడు. దీనిలో భాగంగా పోచంపల్లి మండలం, జిబ్‌లక్‌పల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ మధ్యాహ్నం ఒంటరిగా నడుచుకుంటు వెళ్తుండగా నిందితుడు ఆమె మెడలోని బంగారు చైన్‌ను స్నాచింగ్ చేశాడు.

వెంటనే అప్రమత్తమైన బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దాని సరిహద్దు పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. అందరు కలిసి వాహనాల తనిఖీ చేయడంతో నిందితుడు పోలీసులకు చిక్కాడు. ఆరు గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులను రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News