Wednesday, January 22, 2025

సైబరాబాద్ పోలీసుల అదుపులో చైన్‌స్నాచర్

- Advertisement -
- Advertisement -
Chain snatcher in custody of Cyberabad police
వరుసగా చైన్‌స్నాచింగ్ చేసిన నిందితుడు
రాజస్థాన్‌కు చెందిన ఇరానీ గ్యాంగ్ సభ్యుడు
అహ్మదాబాద్‌లో అరెస్టు చేసిన పోలీసులు
మూడు పోలీస్ కమిషనరేట్ల పోలీసులకు వాంటెడ్

హైదరాబాద్: ఒకే రోజు ఐదు చోట్ల చైన్‌స్నాచింగ్ చేసిన ఇరానీ గ్యాంగ్ యువకుడిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 19వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఐదు చోట్ల మహిళల మెడలోని చైన్‌స్నాచింగ్ చేశాడు. వరుసగా సంఘటనలు జరగడంతో పోలీసులు ఇరానీ గ్యాంగ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌కు చెందిన ఉమేష్ గులాబ్ భాయ్ ఖాతిక్ గుజరాత్‌లో స్థిరపడ్డాడు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో చైన్‌స్నాచింగ్‌లు చేయడంతో రెండు రాష్ట్రాలలో కేసులు ఉన్నాయి. చైన్‌స్నాచింగ్ కోసమే నగరానికి వచ్చిన ఉమేష్ నాంపల్లిలోని ది మెజిస్టిక్‌లో బస చేశాడు. మంగళవారం నగరానికి వచ్చిన నిందితుడు బుధవారం బయటికి వచ్చిన నిందితుడు జియాగూడలో బైక్‌ను చోరీ చేశాడు. దానిపై తిరుగుతూ మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో చైన్‌స్నాచింగ్ చేశాడు. మారేడుపల్లి లోని తుకారాం గేట్‌లో ఒకటి, పేట్‌బషీరాబాద్‌లో మూడు, మేడిపల్లిలో ఒక చైన్‌స్నాచింగ్ చేశాడు.

ఒక్కసారిగా ఐదు చోట్ల చైన్‌స్నాచింగ్‌లు జరగడంతో పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టారు. ఇది ఇరానీ గ్యాంగ్ పనేనని గుర్తించి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఉమేష్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని సంపూర్ణ హోటల్ వద్ద కొట్టేసిన హోండా యాక్టివా బైక్‌ను వదిలేసి పారిపోయాడు. బైక్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించి ఇరానీ గ్యాంగ్ ఉమేష్ ఖాతిక్‌గా గుర్తించారు. నిందితుడు ఎటువైపు పారిపోయాడు తెలుసుకుని, ఫ్లైట్‌లో అహ్మదాబాద్, రాజస్థాన్‌కు వెళ్లిన పోలీస్ బృందాలు నిఘాపెట్టాయి. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా నిందితుడిని పట్టుకునేందుకు గుజరాత్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులు చైన్‌స్నాచర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కరుడుగట్టిన నేరస్థులు….

ఇరానీ గ్యాంగ్ ముఠా సభ్యులు మొత్తం కరుడుగట్టిన నేరస్థులు. తమ వివరాలు పోలీసులకు తెలిసని, కన్పిస్తే పట్టుకుంటారని తెలిసినా కూడా ధైర్యంగా చోరీలు చేసేందుకు బయలుదేరుతారు. రైలు లేదా ఫ్లైట్‌లో వచ్చి ఇక్కడ చైన్‌స్నాచింగ్‌లు చేసి తిరిగి వెళ్లి పోతారు. వాటితో అక్కడ జల్సాలు చేస్తారు. పట్టుబడుతామని తెలిసినా కూడా ఇరానీ గ్యాంగ్ ముఠా సభ్యులు ఎక్కడా బయటపడకుండా చోరీలు చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News