శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సహా చేవెళ్ల, శంకర్ పల్లి ప్రాంతాల్లో వరుసగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. డిసిపి జగదీశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… శంషాబాద్ పరిధిలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన కోటేశ్వర్ అలియాస్ కోటిని అరెస్ట్ చేసి ఏడు తులాల బంగారం, ఓ బైక్ తోపాటు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు గద్వాల జిల్లా తూముకుంట వాసిగా గుర్తించామని డిసిపి పేర్కొన్నారు. చేవెళ్ల పరిధిలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన మనీష్, ప్రీతమ్ తో పాటు మరో యువకుడి అరెస్ట్ చేసి ఒకటిన్నర తులాల బంగారం తోపాటు ఓ బైక్, కత్తి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులంతా వికారాబాద్ జిల్లా వాసులుగా గుర్తించామని తెలిపారు. నిందితులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఆయన చెప్పారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితుల ఆట కట్టించిన పోలీసులపై డిసిపి జగదీశ్వర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.
రంగారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్ల అరెస్ట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -