Monday, January 20, 2025

పురుషుడి మెడలో చైన్ కొట్టేసిన చైన్ స్నాచర్స్

- Advertisement -
- Advertisement -

కళ్ళల్లో కారం కొట్టి పురుషుడి మెడలో చైన్ స్నాచర్స్ చైన్ కొట్టేసిన సంఘటన హైదరాబాద్ నగరం హస్తినాపురం – పద్మావతి నగర్ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. బండారి గోవర్ధన్(43) ఉదయం పాల ప్యాకెట్ తీసుకుని నడుచుకుంటూ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న గోవర్ధన్ కళ్లలో కారం చల్లిన చైన్ స్నాచర్స్ మెడలోని రెండు తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటీవి ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News