Thursday, January 23, 2025

కంట్లో కారం చల్లి చైన్ స్నాచింగ్

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్: కంట్లో కారంచల్లి కిరాణ దుకాణం యాజమాని మెడలోంచి చైన్ లాక్కెళ్లిన సంఘటన వనస్థ్దలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం, పోలీసుల కథనం ప్రకారం… సాహెబ్‌నగర్ పద్మావతినగర్‌కాలనీలో బండారి గోవర్దన్ మహలక్ష్మీ కిరాణ దు కాణం నిర్వహిస్తున్నాడు. తెల్లవారు జామున 6.10 నిమిషాలకు పాలు తీసుకొని మీద ద్విచక్ర వాహనం వస్తున్న గోవర్దన్ కంట్లో కారం చల్లి మెడలోని బంగారు గోలుసును చైన్ స్నాచర్లు తెంచుకొని పారిపోయారు. గోవర్దన్ కారం తుడుచుకొని చైన్‌స్నాచర్లు వెంబడించగా ద్విచక్ర వాహనంపై పా రిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాగా, సంఘటనా స్థ్దలాన్ని పరిశీలించి, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News