- Advertisement -
హైదరాబాద్: నగరంలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి, కూకట్‌పల్లి, రామచంద్రపురంలో ఇటీవల స్నాచింగ్ లకు పాల్పడిన నిందితులను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఒక తపంచా, 13 లైవ్ బుల్లెట్లు, ఒక రివాల్వర్, రెండు లైవ్ బుల్లెట్లు, రెండు కత్తులు, 2 సెల్ ఫోన్లు, 47 గ్రాముల బంగారం, చైన్ స్నాచింగ్ లకు వాడిన బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నేరస్తులు కర్నాటకకు చెందిన ఇషన్ నిరంజన్, నీలం నాలి, రాహుల్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -