Monday, December 23, 2024

సైదాబాద్‌లో చైన్ స్నాచింగ్

- Advertisement -
- Advertisement -

వృద్ధుడిని భయభ్రాంతులకు గురిచేసి మెడలోని చైన్‌ను స్నాచింగ్ చేసిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మాదన్నపేటకు చెందిన ప్రకాష్(61) వెల్డింగ్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం సైదాబాద్ శంఖేశ్వర బజార్ పెట్రోల్ బంక్ వద్ద కారులో దిగుతుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చారు.

ప్రకాష్ చుట్టూ తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేసి మెడలోని రెండు తులాల బంగారు చైన్‌ను లాక్కొని పారిపోయారు. వారిని పట్టుకునేందుకు యత్నించిన వృద్ధుడు కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన ఇద్దరు యువకులు దొంగలను వెంబడించి వారిలో ఒకరిని పట్టుకున్నారు. మరో దొంగ ఆటోలో పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైదాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News