నాలుగు తులాల పుస్తెల తాడు అపహరణ
అబ్దుల్లాపూర్‌మెట్: నగర శివారులో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు(పుస్తెలతాడు)ను ఓ గుర్తుతెలియని వ్యక్తి చోరి చేశాడు. ఈ చైన్ స్నాచింగ్ ఘటన అబ్దుల్లాపూర్‌మె ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వాసం స్వామి కథనం ప్రకారం.. నగరంలోని హస్తినాపురం అనుపమ నగర్ కాలనీకి చెందిన తూపల్లి నర్సింహారెడ్డి, భార్య కమల(55) దంపతు లు తమ స్వగ్రామం యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లికి వెళ్లి తిరిగి నగరం వైపుకు వస్తున్నారు. బాటసింగారం గ్రామ దాటిన తర్వాత హెన్‌హెచ్-65 మెయిన్ రోడ్డు పై ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఎదురుగా రాగానే వెనుక నుండి బైక్ పై వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి కమల మెడలోని పుస్తేల తాడు తెంపడానికి ప్రయత్న చేయగా కమల బైక్ పై నుండి రోడ్డు పై పడిపోయింది. అంతటితో ఆగకుండా అట్టి గుర్తు తెలియని వ్యక్తి కొంత దూరం వెళ్లి మరలా తిరిగి వెనకు వచ్చి కమల మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును గుంజుకొని బైక్ పై నగరం వైపు పారిపోయ్యాడు. బాధితురాలు కమలకు ముఖం పై ఇతర చోట్ల రక్త గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సాయి సంజీవని హాస్పిటల్‌కు తరలించారు. భాదితురాలు భర్త నర్సింహారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
చైన్ స్నాచర్ అరెస్ట్ రిమాండ్…
కేసు దర్యాప్తులో భాగంగా అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ వాసం స్వామి ఆధ్వర్యంలో సిసి కెమెరాలు, ఇతర టెక్నికల్ ఆధారాల సహాయంతో విచారణ వేగవంతం చేశారు. ఎల్బీనగర్ సిసిఎస్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది సహాయంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన హేమంత్ గుప్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడి వద్ద నుండి నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును నేరం చేసేందుకు ఉపయోగించిన బైక్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్ట్‌లో హజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.