Monday, December 23, 2024

శేఖర్ కమ్ముల నివాసం దగ్గర చైన్ స్నాచింగ్…

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ : హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పద్మారావు నగర్‌ కాలనీలో ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్‌ కమ్ముల నివాసం వద్ద చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును ఓ యువకుడు బలవంతంగా లాక్కెళ్లిన ఘటన తెల్లవారుజామున చోటుచేసుకుంది. గొలుసు బలవంతంగా లాగడంతో వృద్ధురాలు కింద పడి గాయాలపాలైంది. స్నాచింగ్ ఎపిసోడ్ మొత్తం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. బాధితురాలు చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News