Saturday, November 16, 2024

చైన్‌ స్నాచింగ్ చేస్తున్న దొంగ అరెస్టు

- Advertisement -
- Advertisement -

Chain snatching thief arrested

 

మనతెలంగాణ, హైదరాబాద్ : ఒంటిరిగా వెళ్తున్న మహిళల మెడలోని చైన్‌లను స్నాచింగ్ చేస్తున్న యువకుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 47 గ్రాముల గోల్డ్ చైన్, హోండా యాక్టివా బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని ముషీరాబాద్, నాగమయ్యకుంటకు చెందిన వడ్డే శివకుమార్ రామ్‌నగర్‌లో ఇసుక వ్యాపారం చేస్తున్నాడు. పదో తరగతి వరకు చదువుకున్న నిందితుడు తర్వాత మానివేశాడు. కొది రోజులు కూలీ పనిచేశాడు, తర్వాత ఇసుక సప్లయ్ చేస్తున్నాడు. వచ్చే డబ్బులు అవసరాలకు సరిపోకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు.

సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితుడు ఒంటరిగా వెళ్తున్న మహిళల చైన్‌లను స్నాచింగ్ చేయాలని ప్లాన్ వేశాడు. గతంలో నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్‌స్నాచింగ్ చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు ఈ నెల 6వ తేదీన అనుమానస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చిక్కడపల్లికి చెందిన రాపర్తి సవిత చైన్‌స్నాచింగ్ చేసిన విషయం బయటపడింది. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం చిక్కడపల్లి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News