Monday, December 23, 2024

ఎమ్మెల్యే నరేందర్‌కు శుభాకాంక్షలు తెలిపిన కుడా ఛైర్మన్

- Advertisement -
- Advertisement -

ఖిలా వరంగల్: సీఎం కేసార్ వరంగల్ తూర్పు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను రెండోసారి ప్రకటించిన సందర్భంగా శివనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను కుడా ఛైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఒగ్లాపూర్ పీఠాధిపతి సైలాని బాబా, వారి అనుచరులు మోహన్ శివనగర్‌ంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నరేందర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు, అభిమానులు, మహిళా నాయకులు, పలు సంఘాలు, మైనార్టీ పెద్దలు, నాయకులు, పాస్టర్లు, పత్రికా విలేఖరులు పెద్ద సంఖ్యలో కలిసి ఎమ్మెల్యేకు పూల బొకేలు, శాలువాలతో సత్కరించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News