Friday, December 20, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హజ్ ఏర్పాట్లను పరిశీలించిన చైర్మన్ బియాబాని

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : హజ్ యాత్ర 2024 సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యాత్రికులకు కల్పించాల్సిన సౌకర్యాలను హజ్ కమిటీ చైర్మన్ మౌలానా సయ్యద్ గులాం అఫ్జల్ బియాబాని పరిశీలించారు. మంగళవారం విమానాశ్రయాన్ని సందర్శించిన చైర్మన్ అక్కడ కల్సించాల్సిన సౌకర్యాల విషయమై పరిశీలించినట్లు రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షేక్ లియాకత్ హుస్సేన్ తెలిపారు. విమానాశ్రయానికి అధికారులతో కలిసి వెళ్ళిన చైర్మన్ విమానాశ్రయం ప్రధాన టెర్మినల్, హజ్ యాత్రికుల బయలుదేరే సమయంలో వారి కోసం కల్పించాల్సిన మెరుగైన సౌకర్యాలు, ప్రార్థనల కోసం వజు చేసే ప్రాంతం, నమాజ్ ప్రాంతం, హోల్డింగ్ ఏరియా, ఎగ్జిట్ గేట్, ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, సెక్యూరిటీ చెక్, వంటి ఏర్పాట్లను పరిశీలించారు.

హజ్ యాత్రికుల విమానాలు మేలో బయలు దేరనున్నాయి.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుండి దాదాపు 11000 మందికి పైగా హజ్ యాత్రికులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరుతారు. తనిఖీ సందర్భంగా చైర్మన్ మౌలానా సయ్యద్ గులాం అఫ్జల్ బియాబాని ప్రధాన టెర్మినల్ వద్ద హజ్ యాత్రికుల కోసం అవసరమైన నిష్క్రమణ ఏర్పాట్లు చేయాలని ఎయిర్‌పోర్ట్ అధికారులకు, జిఎంఆర్ అధికారులకు ఆదేశించారు. హజ్- 2024 కోసం హజ్ యాత్రికులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని అధికారులతో అన్నారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ సభ్యులు మొహమ్మద్ ముజీబుద్దీన్, కార్యనిర్వహణాధికారి షేక్ లియాఖత్ హుస్సేన్, అసిస్టెంట్ ఎగ్జికూటివ్ అధికారి ఇర్ఫాన్ షరీఫ్, ఆర్‌జిఐ ఎయిర్‌పోర్ట్ అథారిటీల అధికారులు, పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News