- Advertisement -
అమరావతి: కూటమి ప్రభుత్వంలో అన్ని శాఖల్లో పురోగతి ఉంది. కానీ మా సంస్థలో అసలు పురోగతి లేదని ఎపి ఫైబర్ నెట్ ఛైర్మన్ జివిరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్ ఐఎఎస్ ఎండి దినేష్ కుమార్ పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 9 నెలల్లో ఒక్క కనెక్షన్ ఇవ్వలేదని, రూపాయి ఆదాయం కూడా రాలేదన్నారు. 78 వేల కి.మీటర్ల ఆప్టిక్ ఫైబర్ ఉందని, రోజూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉందని చెప్పారు. ఐఎఎస్ దినేష్ ఒక్కరోజు కూడా నెట్ వర్క్ పెంచే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. దీంతో పాటు ఫైబర్ నెట్ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని జివిరెడ్డి దుయ్యబట్టారు.
- Advertisement -