Monday, December 23, 2024

బిసి సంక్షేమశాఖలో 37 కార్పొరేషన్లకు చైర్మన్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం 37కార్పొరేషన్‌లకు చైర్మన్‌లను నియమించింది. ఇందుకు సంబంధించి ఈనెల 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చాలా మంది ఆశావహులు నామినేటేడ్ పదవులకు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీలో చురుగ్గా పని చేసి సేవలందించిన వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పదవులకు నామినేట్ చేశారు. పటేల్ రమేష్ రెడ్డి (చైర్మన్,పర్యాటకాభివృద్ధి సంస్థ), కె. శివసే నా రెడ్డి (స్పోర్ట్ అథారిటీ), ఎన్.ప్రీతం (ఎస్‌సి కార్పొరేషన్), నూతి శ్రీకాంత్ (బిసి కార్పొరేషన్), ఎస్. అన్వేష్ రెడ్డి (విత్తనాభివృద్ధి సంస్థ), ఎరావత్ అనిల్ ( మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్),ఎం.విజయబాబు(కోఆపరేటివ్ హౌసిం గ్ ఫెడరేషన్), రాయల నాగేశ్వర రావు( గిడ్డంగుల సంస్థ), కాసుల బాలరాజు (ఆగ్రో ఇండస్ట్రీస్), నేరెళ్ళ శారద (మహిళా కమిషన్), బం డారు శోభారాణి (ఉమెన్ కొ ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), సిహెచ్ జగదీశ్వర్ రావు (ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), జంగా రాఘవ రెడ్డి ( ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్), మనాల మోహన్ రెడ్డి (కొ ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్), బెల్లయ్య నాయక్ (గిరిజన కొ ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్), గురునాథ్ రెడ్డి (పోలీస్ హౌసింగ్), జ్ఞానేశ్వర్ ముదిరాజ్ (డైరీ డెవలప్‌మెంట్), చెల్లా నర్సింహారెడ్డి (అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్), మెట్టు సాయికుమార్ (ఫిషరీస్ ఫెడరేషన్), కొత్తాకు నాగు (ఎస్‌టి కొ ఆపరేటివ్ ఫైనాన్స్), జనక్ ప్రసాద్ (కనీస వేతన సలహా మండలి), ఎండి రియాజ్ (గ్రంథాలయ పరిషత్), ఎం. వీరయ్య (వికలాంగుల కార్పొరేషన్), నాయుడు సత్యనారాయణ(హ్యాండీక్రాఫ్ట్), ఎం.ఎ జబ్బార్ (మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్), టి. నిమ్మల జగ్గారెడ్డి (టిజిఐఐసి), రాంరెడ్డి మల్‌రెడ్డి (రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్), కాల్వ సుజాత (వైశ్య కార్పొరేషన్), పోడెం వీరయ్య(ఫారెస్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్), ఐతా ప్రకాశ్ రెడ్డి (ట్రేడ్, ప్రమోషన్), కె. నరేందర్ రెడ్డి (శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ), అలేఖ్య పుంజాల (సంగీత్, నాటక్ అకాడమి), ఎన్. గిరిధర్ రెడ్డి (ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్), మన్నె సతీష్ కుమార్ (టెక్నాలజీ సర్వీసెస్), జరిపేటి జైపాల్ (ఎంబిసి డెవలప్‌మెంట్ కార్పొరేషన్), ఇ. వెంకట్ రామిరెడ్డి ( కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ), ఎం.ఎ. ఫహీం (తెలంగాణ ఫుడ్స్) లను నియమించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News