Wednesday, November 27, 2024

పూరీ జగన్నాథ రత్నభాండాగారం పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీ

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : ప్రఖ్యాత పూరీ క్షేత్రం లోని జగన్నాథ ఆలయంలో అమూల్యమైన ఆభరణాలతో తరతరాలుగా భద్రపరిచిన రత్నభాండాగారంపై కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. మూసి ఉన్న ఈ రత్నభాండాగారం తెరవడానికి అనేకసార్లు ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. తాళాలు కూడా అదృశ్యం కావడం , తరువాత అవి లభించడం అనుమానాలకు దారి తీసింది. ఆ రత్నభాండాగారంలో ఎన్ని విలువైన ఆభరణాలు ఉన్నాయో ఇంతవరకు జాబితా తయారు కావడం కానీ వాటిని లెక్కకట్టడం కానీ జరగలేదు. ఈ నేపథ్యంలో రత్నభాండాగారం పర్యవేక్షణకు ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని హైకోర్టు సూచించడంతో రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకుని ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ్ర సుప్రీం కోర్టు మాజీ జడ్జి ఆర్జిత్ పశాయత్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం వెల్లడించారు.

అనేక దశాబ్దాలుగా మూత పడి ఉన్న ఈ రత్నభాండాగారం లోని ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల జాబితాతయారు చేయడానికి , వాటిని పర్యవేక్షించడానికి ఒడిశా హైకోర్టు ఆదేశాలపై ఈ కమిటీని నెలకొల్పినట్టు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వివరించారు. 12 మందితో కూడిన ఈ కమిటీలో మాజీ సుప్రీం జడ్జి జస్టిస్ ఆర్జిత్ పశాయత్‌తోపాటు ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ రమాకాంత పండా వైస్ ఛైర్మన్‌గా నియామకమయ్యారు. అలహాబాద్ బ్యాంక్ మాజీ సిఎండి డాక్టర్ బిధుభూషణ్ సమాల్, చార్టర్డ్ అకౌంటెంట్ ఎకె సబత్, పూరీ రాజవంశీకులు గజపతి దివ్యసింఘ దేవ్, ఆర్కెయాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధిగా, దుర్గాప్రసాద్ దాస్‌మొహాపాత్ర ,మాధవ చంద్ర మొహాపాత్ర , జగన్నాథ్‌కార్, గణేశ్‌మెకాప్, సేవకులుగా, పూరీ కలెక్టర్, శ్రీజగన్నాథ్ ఆలయ అడ్మినిస్ట్రేషన్ కు చెందిన చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఈ కమిటీలో నియామకమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News