వరంగల్: భారతదేశ వ్యాప్తంగా 25 నగరాలలో 30కు పైగా ఇనిస్టిట్యూషన్స్‌లో ఉన్నత విద్యా సేవలను అందిసున్న సన్‌స్టోన్ ఇప్పుడు తమ ప్రయోజనాలను తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లోని చైతన్య (డీమ్డ్ టు బీ యూనివర్శిటీ) కు అందిస్తోంది. యుజీసీ గుర్తింపు పొందిన చైతన్య, విస్తృతశ్రేణి ప్రోగ్రామ్‌లను డిప్లమో, పీజీ, పీహెచ్‌డీ లో అందిస్తుంది.
ఈ జోడింపుతో ఇప్పుడు సన్‌స్టోన్ యొక్క ప్రయోజనాలు చైతన్య (డీమ్డ్ టు బీ యూనివర్శిటీ) అందిస్తోన్న బీకామ్, బీటెక్, బీబీఎ, బీసీఏ, ఎంసీఏ మరియు ఎంబీఏ కోర్సుల కు సైతం లభ్యమవుతాయి. సన్‌స్టోన్ యొక్క ప్రయోజనాలు పరిశ్రమ ఆధారిత విద్య, నైపుణ్య కార్యక్రమాలకు తగిన అవకాశాలనందిస్తాయి. ఈ చేరికతో సన్‌స్టోన్ యొక్క 1000కు పైగా రిక్రూటర్ల నెట్‌వర్క్‌తో పాటుగా 2వేలకు పైగాఉపాధి అవకాశాలను సైతం పొందేందుకు విద్యార్ధులకు అవకాశాలను తెరుస్తుంది. దీనితో సుప్రసిద్ధ కంపెనీలలో పెద్ద ఎత్తున ప్లేస్‌మెంట్ అవకాశాలు కూడా లభిస్తాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఔత్సాహిక విద్యార్ధులను వరంగల్ ఆకర్షిస్తుంది. దీనికి తోడు యువతరం కోసం ఉన్నత విద్యను మరింత చేరువ చేస్తూ వినూత్న పథకాలను తెలంగాణా ప్రభుత్వం ప్రారంభించింది.
సన్‌స్టోన్ కో–ఫౌండర్ అండ్ సీఓఓ పియూష్ నాన్ర్గు మాట్లాడుతూ ‘‘వరంగల్‌లో చైతన్య ( డీమ్డ్ టు బీ యూనివర్శిటీ) వద్ద సన్ స్టోన్ యొక్క ప్రయోజనాలను అందిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. అవకాశాలు, నాణ్యమైన బోధన పరంగా ఎదురవుతున్న అంతరాలను పూరించడం ద్వారా ఉన్నత విద్య కోరుకుంటున్న విద్యార్ధుల పూర్తి సామర్ధ్యం వెలికి తీసేందుకు కృషి చేస్తున్నాము’’ అని అన్నారు.
చైతన్య (డీమ్డ్ టు బీ యూనివర్శిటీ) వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఈ విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ‘‘విద్యార్ధులకు అందుబాటు ధరలో అత్యున్నత నాణ్యత కలిగిన విద్యను అందించడంతో పాటుగా సమాజ దీర్ఘకాల అభివృద్ధి అనేవి మాకు అత్యంత ప్రాధాన్యతా అంశాలు. మేము మా విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందాలని, ఆ విద్య ద్వారా వారు జీవితంలో విజయం వైపుగా పయనించాలని కోరుకుంటుంటాము. సన్‌స్టోన్ ఆఫరింగ్, మా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రయోజనం కలిగించనుందని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
Chaitanya Deemed to be University powered by Sunstone Edge