Tuesday, December 24, 2024

బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ

- Advertisement -
- Advertisement -

ఆమె పోరాట స్ఫూర్తి తెలంగాణ ఉద్యమంలో ఇమిడి ఉన్నది

వర్ధంతి సందర్భంగా స్మరించుకున్న సిఎం కెసిఆర్

తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి ప్రతీక చిట్యాల ఐలమ్మ:  ముఖ్యమంత్రి కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి చిట్యాల ఐలమ్మ ప్రతీక అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఐలమ్మ 38వ వర్ధంతి (సెప్టెంబర్ 10) సందర్భంగా సాయుధ తెలంగాణ పోరాట కాలంలో ఆమె కనబరిచిన ధైర్య సాహసాలను సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు. వివక్షను ఎదురిస్తూ సాగిన నాటి ఐలమ్మ పోరాట స్పూర్తి, తెలంగాణ సాధన ఉద్యమంలో ఇమిడి వున్నదని సిఎం తెలిపారు. ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ , తెలంగాణ పోరాట యోధులను సమున్నత రీతిలో స్మరించుకుంటున్నదని తెలిపారు. సబ్బండ కులాలు, మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శవంతంగా నిలిచాయని సిఎం తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News