- ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు: నేటి తరానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు. గురువారం మండల పరిధిలోని పాశమైలారం గ్రామంలో గ్రామ సర్పంచ్ మొటె కృష్ణ యాదవ్‌తో కలసి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల అడుగుజాడల్లో యువత నడువాలన్నారు.బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహిళ చాకలి ఆలమ్మ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఐలమ్మ స్ఫూర్తితోనే మన సిఎం కెసిఆర్ పోరాడారన్నారు. చాకలి ఐలమ్మ జ్ఞాపకార్ధం విగ్రహ ప్రతిష్ట చేపట్టినట్టుగా చెప్పారు.
మహనీయుల పోరాటాలు నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం మన సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. రజకర్లకు వ్యతిరేకంగా పోరాడిన యోదురాలు చాకలి ఐలమ్మ అన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ ఉద్యమ కారులకు కెసిఆర్ ప్రబుత్వం గుర్తింపు ఇస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పార్టి సీనియర్ నాయకులు దశరత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నవీన్ రెడ్డి, గ్రామ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.