Tuesday, November 5, 2024

బీసి కమిషన్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ 126వ జయంతి ఉత్సవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి సారిగా అధికారికంగా నిర్వహిస్తున్న వీరనారి చాకలి ఐలమ్మ 126వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా బీసీ కమిషన్ సభ్యులు కోతి కిషోర్ గౌడ్, సిహెచ్ ఉపేంద్ర హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధిపత్య, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాట రణ నినాదాన్ని మోస్తూ దొరలను గడీల నుంచి ఉరికించి తెలంగాణ ప్రజల అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడిన వీరవనిత.. తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపేందుకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, మోడ్రన్ వాషింగ్ మిషన్లను రజకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో ఆనాడు వలసపాలకుల అణిచివేతకు వ్యతిరేకంగా మహిళలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అనిల్ గౌడ్, రజక విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలేటి రమేష్, కార్యదర్శి మలిపెద్ది శ్రీకాంత్, రాము, దిలీప్, ప్రవీణ్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Chakali Ilamma birthday celebration at BC Commission Office

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News