Monday, December 23, 2024

చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు: కలెక్టర్ అనుదీప్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదిప్ దురిశె ట్టి అన్నారు. చాకలి ఐలమ్మ 128 వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కలెక్టరేట్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని ,తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలు అని కొనియాడారు. వీర నారీ చాకలి ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అధికారికంగా జరపడం సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమాధికారి ఆశన్న, జిల్లా పరిశ్రమల అధికారి పవన్ కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News