హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక అని జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్‌రోస్ కొనియడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలను మంగళవారం జిహెచ్‌ఎంసి కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిహెచ్‌ఎంసి కమిషనర్ వీర నారి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి ప్పూల మాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం కమిషనర్ రోనాల్ రోస్ మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ అన్ని వర్గాల హక్కుల సాధన కోసము పోరాటం చేసిన దీరవనిత, ప్రజాస్వామ్యవాదిఅని కమిషనర్ పేర్కొన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా చిట్యాల ఐలమ్మ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని అన్నారు.
చిట్యాల ఐలమ్మ త్యాగాలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.చాకలి ఐలమ్మ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ సరోజ, విజయలక్ష్మి ,యాదగిరిరావు జయరాజ్ కెన్నెడీ, ఎస్టేట్ మేనేజర్ బాషా, యు సి డి చంద్రకాంత్ రెడ్డీ రెసి పి ఆర్ ఓ ముర్తుజా, జాయింట్ కమిషనర్ జయంత్ పాల్గొన్నారు.