మనతెలంగాణ/హైదరాబాద్: చిట్యాల చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలను ఆదివారం డిజిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎఐజి రాజేంద్ర ప్రసాద్ చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఎసిబిహెడ్ ఆఫీస్లో డైరెక్టర్ జనరల్ గోవింద్ సింగ్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో జరిగాయి. అదేవిధంగా సైబరాబాద్ సిపి కార్యాలయంలోనూ చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనే తన హక్కుల సాధన కోసం, చట్టం పరిధిలో, కోర్టుల్లో న్యాయం కోసం కొట్లాడిన గొప్ప ప్రజాస్వామికవాది చిట్యాల ఐలమ్మ అన్నారు.తెలంగాణ స్వాతంత్రోద్యమంలో మరియు నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు . తెలంగాణ స్వాతంత్రోద్యమ సమరయోధులను స్మరించుకోవడం మనందరి బాధ్యతని, వారి ఆశయాలను కొనసాగించాలన్నారు.ఈ కార్యక్రమంలో సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ ఎడిసిపిమాణిక్ రాజ్, సీఎస్ డబ్ల్యూఎడిసిపివెంకట్ రెడ్డి, ఎసిపిమట్టయ్య, సంతోష్ కుమార్, ధనలక్ష్మి, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.