Wednesday, January 22, 2025

తెదేపా నియోజకవర్గ ఇన్‌చార్జిగా చక్రపాణి

- Advertisement -
- Advertisement -

మంచాల: తెలుగుదేశం పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జిగా మండల పరిధిలోని నోముల గ్రామానికి చెందిన చింతకింది చక్రపాణిని రెండవసారిగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ తనపై నమ్మకంతో రెండవసారి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎన్నికకు సహకరించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జ్ఞానేశ్వర్, భువనగిరి పార్లమెంట్ అధ్యక్షులు కృష్ణమాచారి, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంకు ఇందిరా ఇతర ముఖ్య నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News