Thursday, January 23, 2025

అమ్మాయి కూడా ఈఎంఐలో దొరికితే?

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలో అన్ని వస్తువులు ఈఎంఐలో దొరుకుతాయి. అలాగే అమ్మాయి కూడా ఈఎంఐలో దొరికితే ఎలా ఉంటుంది? అనే నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘ఈఎంఐ’ (ఈ అమ్మాయి). దొంతు బుచ్చయ్య , బమ్మిడి సంగీత సమర్పణలో శ్రీ అవదూత వెంకయ్య స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై నోయల్ సీన్ , బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ, చమ్మక్ చంద్ర, సత్తి పండు, ధనరాజ్, భద్రం, చలాకి చంటి నటీ నటులుగా దొంతు రమేష్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డి.రమేష్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా ‘ఈఎంఐ’ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నవీన్ మేడారం, అజయ్ సామ్రాట్, గోపి గణేష్, బుర్రా ప్రశాంత్ గౌడ్, నిమ్మల శ్రీరామ్,

సంగీత, సంధ్య జనక్, ప్రభు, కీర్తి లత గౌడ్, దిల్ రమేష్, సునామి సుధాకర్, గంగాధర్, నవీన్, క్రిష్, దొంతు బుచ్చియ్య, రాజీవ్, ఉదయ్ శ్రీ, శ్రీదేవి తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొని చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు దొంతు బుచ్చయ్య మాట్లాడుతూ వివిధ దశల్లో అమ్మాయిలు ఎదుర్కొనే రక రకాల సమస్యలను కథాంశంగా తీసుకొని రూపొందించిన చిత్రమే ‘ఈఎంఐ’ అని చెప్పారు. చిత్ర దర్శకుడు దొంతు రమేష్ మాట్లాడుతూ ఈ నెల 10 న వస్తున్న మా ‘ఈఎంఐ’ సినిమాను బిగ్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో నోయల్, హీరోయిన్ భాను శ్రీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News