- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ నటుడు చలపతి రావు (78) ఆదివారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో చలపతి రావుకు గుండె పోటు రావడంతో హఠాన్మరణం చెందారు. 1966లో ‘గూడచారి’ అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆయన దాదాపుగా 600కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకులను మెప్పించారు. చల్లిపతి రావు 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లిపర్రిలో జన్మించారు. రెండు రోజల వ్యవధిలో కైకాల సత్యనారాయణ, చలపతిరావు మృతి చెందడంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చలపతి రావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుడు రవిబాబు దర్శకుడు, నిర్మాతగా ఉన్నాడు. రాష్ట్రపతి గారి అల్లుడు, పెళ్లంటే నూరేళ్ల పంట, జగన్నాటకం, కడప రెడ్డమ్మ, కలియుగ కృష్ణుడు తదితర సినిమాలకు చలపతి రావు నిర్మాతగా వ్యవహరించారు.
- Advertisement -