- Advertisement -
చండూరుః స్వర్గీయ దోటి అంజయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని మునుగోడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లమల్ల కృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, 25వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి సంతాపం, ప్రగాఢ సానుభూతి వెలిబుచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగూరి యాదయ్య, మాజి సర్పంచ్ కోడి గిరిబాబు, కల్లెట్ల మారయ్య, పట్టణ అధ్యక్షులు వడ్డేపల్లి బాస్కర్ ఆవుల అశోక్, వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- Advertisement -