కాటారం : హత్య రాజకీయాలకు మంథని నియోజకవర్గం అడ్డాగా మారిందని, తనపై పెరుగుతన్న ప్రజాదరణ ఓర్వలేకనే తనపై హత్యాప్రయత్నం జరిగిందని మంథని నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి చల్లా నారాయణరెడ్డి ఆరోపించారు. శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గురువారం మంథనిలో నామినేషన్ ప్రక్రియలో భాగంగా తనను ఆశీర్వదించడానికి వచ్చిన జనసంద్రోహాన్ని చూసి ఓర్వలేక నన్ను హతమార్చడానికి ఒక బహుజన నాయకుడు కట్రలు చేస్తున్నాడని అన్నారు. గత కొన్ని రోజుల క్రితం కొండగట్టులో బృందావన్ రిసార్ట్‌లో సమావేశం ఏర్పాటు చేసి తన గన్‌మెన్‌లను తొలగించి నన్ను హత మార్చడానికి కుట్రలు చేసారని తెలిపారు.
మంథని నియోజకవర్గంలో కడప రీతిలో హత్యలను ప్రోత్సహిస్తున్న తీరు కనబడుతుందన్నారు. హత్యలు చేసే వారిని ఎలా ప్రోత్సహిస్తామరని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుండాగిరి, హత్యలు, అక్రమాలు, అరాచకాలు చేస్తున్న నాయకులకు మన ఓటు అనే ఆయుధంతో బుద్ది చెప్పి మంథని నియోజకవర్గం నుండి తరిమికొట్టే రోజులు త్వరలో వస్తున్నాయని తెలిపారు. వీటన్నింటినీ అంతమొందించాలంటే ఏనుగు గుర్తుకు ఓటువేసి మాయావతి నాయకత్వాన్ని, ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ నాయకత్వాన్ని బహుజన వాదాన్ని బలపరిచి మంథని నియోజకవర్గం నుండి బరిలో నిలుస్తున్న నాకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట బీఎస్పీ నాయకులు ఉన్నారు.