Monday, January 20, 2025

మాట తప్పిన మంత్రి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 2009 లో ఎపిలోని చిత్తూరు జిల్లా రొంపిచెర్ల, ఎర్రావారిపాలెం మండలాల సరిహద్దలో రూ. 10 కోట్ల అంచనాతో చల్లంపల్లె ప్రాజెక్టు మంజూరైంది. అప్పట్లో పీలేరు నియోజకవర్గ ఎంఎల్ఎ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబీలకు కాంటాక్ట్ దక్కింది. ప్రాజెక్ట్ కోసం రైతుల వద్ద నుంచి 100 ఎకరాల భూమి సేకరించారు. కానీ రైతులకు మాత్రం పరిహరం అందించలేదు. ఈ క్రమంలో రైతులు ప్రాజెక్టు పనులను అడ్డుకోగా ముందుగా ప్రాజెక్టు పనులు పూర్తి కానివ్వండి తర్వాత పరిహరం ఇప్పిస్తానని ఎంఎల్ఎ పెద్దిరెడ్డి రైతులకు హామీ ఇచ్చారు.

తర్యాత పెద్దిరెడ్డి కుటుంబీకులు ప్రాజెక్టును పూర్తి చేసి బిల్లు కూడా తీసుకున్నారు. అది జరిగి 13 సంవత్సరాలవుతున్నా రైతులకు ఇప్పటికి నష్ట పరిహరం అందలేదు. ప్రాజెక్టు కోసం రైతులు భూములు కోల్పోయి చేతిలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇకనైనా పెద్దిరెడ్డి చరువా చూపి రైతులకు పరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News