Monday, December 23, 2024

చలానాల రాయితీ ఏప్రిల్ 15వరకు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Challan discount extended till April 15

మార్చి 30నాటికి
వ్యాప్తంగా 2.40 కోట్ల
పెండింగ్ చలానాల కింద
రూ.840 కోట్ల చెల్లింపులు:
హోం మహమూద్ అలీ

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు. ఈక్రమంలో మార్చి 1 నుండి 31వ తేదీ వరకు పెండింగ్ చలాలను గడువును ఏప్రిల్ 15వ తేదీ వరకు పెంచుతూ సిఎం నిర్ణయం తీసుకున్నట్లు హోంమంత్రి తెలిపారు. కాగా మార్చి 30 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లకు సంబంధించి రూ.840 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 52% మోటారు వాహన యజమానులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు. ఈ అవకాశాన్ని పొడిగించాలని అనేక విజ్ఞప్తులు రావడంతో మరో పదిహేను రోజుల పాటు పెండింగ్ చలానాలపై రాయితీ అవకాశాన్ని పొడిగించామని వివరించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర పోలీస్ శాఖ గత రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల పేదలు, మధ్య తరగతి వారు ప్రజలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో మాదిరిగానే బైకులు 25 శాతం చెల్లిస్తే సరిపోతుందని 75% చలాన్ అమౌంట్‌ను రద్దు చేస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. కార్లు, లైట్ మోటార్ వెహికల్స్ 50 శాతం, ఆర్‌టిసి బస్సులకు 70 శాతం, తోపుడు బండ్లకి 80 శాతం రాయితీ కల్పించామన్నారు.. అయితే ఈ ఆఫర్ ఈ నెల 31 వరకే అయిపోనుండటంతో తిరిగి వచ్చే నెల 15వరకు గడవు పొడిగించామని వివరించారు.ఆన్‌లైన్,ఇ-సేవ, మీసేవ ద్వారా గాని చెల్లించవచ్చని హోంమంత్రి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News