Monday, December 23, 2024

చల్లపల్లిలో యువకుడి గొంతుకోసి…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం లక్ష్మీపురంలోని నెహ్రూనగర్‌లో మంగళవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. పుచ్చగడ్డ బైపాస్ రోడ్డులో వినయ్ అనే యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. యువకుడి గొంతుకోసి గుర్తు తెలియని దుండగులు చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రేమ వ్యవహారం, వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ యథాతథం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News