Friday, November 15, 2024

8,9 తేదీల్లో ఛలో ఢిల్లీ : ఆర్.కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిసి ప్రధానిగా ఉన్న దేశంలో బిసిలకు న్యాయం జరగడం లేదని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బిసిల డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 8,9 తేదీల్లో ఛలో ఢిల్లీ చేపడుతున్నట్లు చెప్పారు. పార్లమెంటు వద్ద నిరసన ప్రదర్శన చేపట్టనున్నామని ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుండి బిసిలు పెద్ద ఎత్తున తరలివస్తారన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఛలో ఢిల్లీ వాల్ పోస్టర్‌ను కృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన బిసిలకు 56 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్లమెంటు భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

అగ్రకులాలు ఎలాంటి ధర్నాలు, డిమాండ్ చేయకున్నా 10 శాతం రిజర్వేషన్లు కల్పించారని కృష్ణయ్య ఆరోపించారు. బిసిలను పాలకులు ఓటు వేసే యంత్రాలుగా చూస్తున్నారని ఆయన ఆరోపించారు. బిసిలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం అన్ని రాష్ట్రాల్లోని బిసిలను ఏకం చేసి పోరాడుతామన్నారు. బిసి ప్రజా ప్రతినిధులు కూడా రిజర్వేషన్ల సాధన పోరాటంలో భాగస్వామ్యం కావాలని లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని కృష్ణయ్య అన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బిసిలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News