Thursday, December 19, 2024

అసెంబ్లీ తీర్మానం… బిఆర్ఎస్ విజయం

- Advertisement -
- Advertisement -

చలో నల్లగొండ ఎఫెక్ట్…

బిఆర్‌ఎస్ ఒత్తిడితో అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్: కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఒత్తిడితోనే కెఆర్‌ఎంబికి ప్రాజెక్టులను అప్పగించట్లేదని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెడుతున్నదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పడానికి నిరసనగా మంగళవారం నల్లగొండలో బిఆర్‌ఎస్ తలపెట్టిన ‘చలో నల్లగొండ’ సభ వల్లే కాంగ్రెస్‌లో చలనం వచ్చిందని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్‌ఎస్‌కు దక్కిన తొలి విజయంగా భావిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో కెటిఆర్ పోస్ట్ చేశారు.

ఉత్తమ్ మాట్లాడేది మాకే అర్థం కాలేదు.. ప్రజలకు ఏం అర్థమవుతుంది?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కెటిఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి పవర్ ప్రెజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్‌లోనే ఉందని, ఆయన తెలుగులో మాట్లాడకుండా… ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని, ఆయన మాట్లడేది మాకే అర్థం కావడం లేదు, తెలంగాణ ప్రజలకు ఏం అర్థమౌతుందని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News