Wednesday, January 22, 2025

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిశారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ ఎన్నికలలో ఘన విజయం సాధించిన కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందించారు. అనంతరం ఆయన శాసనసభ్యుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News