బెంగళూరు: అన్న కూతురుకు కీర దోసకాయ తినిపించే విషయంలో గొడవ జరగడంతో చెల్లిని అన్న కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రంలో చామరాజనగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కొళ్లేగాల ఈద్గా మొహల్లాలో సయ్యద్(60) అనే వ్యక్తి తన ఇద్దరు కుమారులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఫార్మన్ తన అన్న కూతురుకు కీర దోసకాయ తినిపిస్తున్నాడు. అతడి సోదరి ఐమాన్ బాను పాపకు జ్వరం ఉంది, దోసకాయ తినిపించకు అని ఫార్మన్‌ను హెచ్చరించింది.
దీంతో సోదరితో ఫార్మన్‌తో గొడవకు దిగడంతో ఘర్షణ తారా స్థాయికి చేరుకుంది. వెంటనే అతడు కత్తితో తీసుకొని సోదరిపై దాడి చేశాడు. దాడిని అడ్డుకునేందుకు తండ్రి సయ్యద్, వదినా తస్లిమా తాజ్ ప్రయత్నించారు. ముగ్గురుపైన ఫార్మన్ కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ముగ్గురిని సిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఇమాన్ బాన్ మృతి చెందిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మిగిలిన ఇద్దరు ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని, తండ్రి చేయి విరిగిందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.