Sunday, December 22, 2024

యువతితో అక్రమ సంబంధం… ప్రియుడ్ని ఎనిమిది ముక్కలుగా నరికి

- Advertisement -
- Advertisement -

 

సిమ్లా: ముస్లిం యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ప్రియుడ్ని చంపి ఎనిమిది ముక్కలుగా నరికి మృతదేహంలోని భాగాలను మురికి కాలువలో పడేసిన సంఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లా సలూని ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మనోహర్ (21) అనే యువకుడు ముస్లిం యువతితో ప్రేమలో పడడంతో పాటు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు తమ కూతురుకు దూరంగా ఉండాలని మనోహర్‌ను పలుమార్లు బెదిరించారు. యువతి సోదరుడు మనోహర్‌తో గొడవ పడ్డాడు.

Also Read: మర్రి జనార్ధన్ రెడ్డి ఇంటిపై ఐటి దాడులు

ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో మనోహర్‌ను చంపేశారు. మనోహర్ మృతదేహాన్ని ఎనిమిది ముక్కలుగా నరికి బ్యాగ్‌లో పెట్టి మురికి కాలువలో పడేశారు. మనోహర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువతి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశారని ఒప్పుకున్నారు. మురికి కాలువ నుంచి శరీర భాగాలను బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. చేతలు, కాళ్లు, తల కనిపించలేదని ఎస్‌పి అభిషేక్ యాదవ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News