Sunday, December 22, 2024

మైనర్‌తో అక్రమ సంబంధం… యువకుడిని ముక్కలు ముక్కలుగా నరికి…

- Advertisement -
- Advertisement -

సిమ్లా: తమ కూతురుతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో యువకుడిని చంపేసి ముక్కలు ముక్కలుగా నరికిన సంఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మనోహర్ అనే వ్యక్తి జూన్6న కనిపించకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జూన్9న సలోని జిల్లా బందల్ పంచాయతీలోని కాలువ నుంచి మృతదేహంలోని భాగాలను పోలీసులు బయటకు తీశారు. మనోహర్ మరో మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించడంతో పాటు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో షబీర్, ముసాఫిర్ హుస్సేన్, అతడి భార్య ముగ్గురి కలిసి మనోహర్‌ను చంపేశారు.

Also Read: అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవదహనం

అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కాలువలో పడేశారు. రెండు మతాలు వేరు కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం బాలికను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని ఎస్‌పి చంబా అభిషేక్ యాదవ్ తెలిపాడు. మనోహర్‌ను చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సిబిఐతో విచారణ జరిపించాలని స్థానిక బిజెపి ఎంఎల్‌ఎ హన్స్ రాజ్ డిమాడ్ చేస్తున్నారు. రెండు మతాలకు సంబంధించిన వ్యక్తులతో సామరస్యంగా, శాంతిగా ఉండాలని చెప్పామని డిప్యూటీ కమిషనర్ అపూర్వ దేవగన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News