Friday, December 20, 2024

జర్నలిస్టు ధన్య రాజేంద్రన్‌కు చమేలీ దేవి జైన్ అవార్డు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అత్యుత్తమ మహిళా మీడియా ప్రతినిధులకు అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చమేలీ దేవి జైన్ అవార్డు 2022 కు సంబంధించి న్యూస్ మైన్యూట్‌కు చెందిన జర్నలిస్ట్ ధన్య రాజేంద్రన్‌కు దక్కింది. ఈ అవార్డును మీడియా ఫౌండేషన్ బుధవారం వెల్లడించింది. బెంగళూరుకు చెందిన రాజేంద్రన్ డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారం “ది న్యూస్ మైన్యూట్ ” కు ఎడిటర్ ఇన్ చీఫ్ కాకుండా సహ సంస్థాపకురాలుగా ఉన్నారు.

పిటిఐ భాషా ఎడిటర్ నిర్మల్ పాథక్, కాలనిస్టు నిధి రజ్దాన్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన నేషనల్ రూరల్ ఎఫైర్స్ , అగ్రికల్చర్ ఎడిటర్ హరీష్ దామోదరన్ లతో కూడిన ముగ్గురు సభ్యుల జ్యురీ ఈ అవార్డును ప్రకటించింది. ప్రజాస్వామ్యంపై ఉత్తమ జర్నలిజం ఎలా ప్రభావం చూపిస్తుందో రాజేంద్రన్ రిపోర్టింగ్ నిరూపించిందని వీరు ప్రశంసించారు. న్యూఢిల్లీ లోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ వద్ద మార్చి 21న ఈ అవార్డు బహూకరిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News