- Advertisement -
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా మాజీ ఫాస్ట్ బౌలర్ చమిండా వాస్‌ను నియమించారు. శ్రీలంక అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్‌గా చమిండా వాస్ పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ముత్తయ్య మురళీధరన్ తర్వాత వాస్ లంక ప్రధాన బౌలర్‌గా ఓ వెలుగు వెలిగాడు. తాజాగా అతన్ని బౌలింగ్ కోచ్‌గా నియమిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాస్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించిన విషయాన్ని లంక బోర్డు శుక్రవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇదిలావుండగా గతంలో కూడా వాస్ లంక బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆ పదవి నుంచి వైదొలిగాడు. తాజాగా అతన్ని మరోసారి కీలకమైన బౌలింగ్ కోచ్ పదవిని అప్పగించారు. వాస్ శ్రీలంక అగ్రశ్రేణి బౌలర్‌లలో ఒకడిగా నిలుస్తాడు. టెస్టుల్లో 355, వన్డేల్లో 400 వికెట్లను వాస్ సాధించాడు.
- Advertisement -