Sunday, January 19, 2025

ఝార్ఖండ్ శ్రేయస్సుకే బిజెపిలో చేరుతున్నా

- Advertisement -
- Advertisement -

జెఎంఎంకు, మంత్రి పదవికి రాజీనామా చేస్తా
చంపై సోరెన్
రాంచీ : ఝార్ఖండ్ ప్రయోజనాల దృష్టానే భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరాలని నిర్ణయించుకున్నట్లు, జెఎంఎం నుంచి, మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ బుధవారం ప్రకటించారు. తాను ఏ పరిస్థితికీ భయపడడం లేదని సీనియర్ ఆదివాసీ నేత చంపై సోరెన్ స్పష్టం చేశారు. ఈ వారారంభంలో న్యూఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలుసుకుని బిజెపిలో చేరనున్నట్లు ప్రకటించిన చంపై సోరెన్ తన కుమారునితో పాటు బుధవారం రాంచీ చేరుకున్నారు. ఆయనకు మద్దతుదారులు అధిక సంఖ్యలో స్వాగతం పలికారు. ‘ఝార్ఖండ్ ప్రయోజనం దృష్టానే నా నిర్ణయం(బిజెపిలో చేరాలన్నది)& నేను పోరాటాలకు అలవాటు పడ్డాను’ అని చంపై చెప్పారు. తనపై ‘నిఘా’ ఉందన్న ఆరోపణ గురించి ప్రశ్నించగా, తాను ఎటువంటి పరిస్థితికీ భయపడడం లేదని ఆయన సమాధానం ఇచ్చారు. తాను జెఎంఎంకు, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చంపై సోరెన్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News