Monday, December 23, 2024

ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపయి సోరెన్ ప్రమాణం

- Advertisement -
- Advertisement -

రాంఛీ: ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపయి సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో చంపయి చేత గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. చంపయి ప్రస్తుతం జెఎంఎం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. జెఎంఎం, కాంగ్రెస్ నుంచి ఒక్కో ఎంఎల్‌ఎ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఝార్ఖండ్ కు ఏడో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సరైకల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. హేమంత్ సోరెన్ మంత్రి వర్గంలో ఆయన రవాణా, గిరిజన షెడ్యూల్డ్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. సరైకల నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎంఎల్ఎగా విజయం సాధించారు. 1995లో తొలిసారిగా ఎంఎల్ఎగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1956 నవంబర్ 1న ఝార్ఖండ్ లోని సరైకల ప్రాంతంలో జన్మించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News