Wednesday, January 22, 2025

చంపై సోరెన్ బిజెపిలో చేరబోతున్నారా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  చంపై సోరెన్ జార్ఖండ్ లో ప్రస్తుతం జల వనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. జనవరిలో ఈడి హేమంత్ సోరెన్ ను అరెస్టు చేశాక ఆయన ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు తీసుకున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్ హేమంత్ సోరెన్ కు చంపై సోరెన్ చాలా సన్నిహితుడు. అయితే ఆయన అనూహ్యంగా ఆదివారం ఉదయం ఢిల్లీకి వెళ్లడంతో చాలా ఊహాగానాలు ఊపందుకున్నాయి.

చంపై సోరెన్ శనివారం రాత్రి కోల్ కతా హోటల్ లో బిజెపి నాయకుడు సువేంధు అధికారితో భేటీ అయినట్లు ‘ఇండియా టుడే’ రాయడంతో ఊహాగానాలకు మరింత ఊపొచ్చింది. హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదల అయ్యాక చంపై సోరెన్ ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టారని ఓ ఛానెల్ రిపోర్టు చేసింది. ఆయన ఇక బిజెపి బడా నాయకులతో ములాఖత్ అవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంపై సోరెన్ వెంట ఆరుగురు ఎంఎల్ఏలు, వ్యక్తిగత సిబ్బంది ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. చంపై సోరెన్, బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కాంటాక్ట్ లో ఉన్నారని సమాచారం. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాక ఆయన బిజెపిలోకి మారాలనుకుంటున్నారని వినికిడి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News