Tuesday, January 14, 2025

యువతి హత్య… ఆ ఇంట్లోనే మరో యువకుడు ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ లోని చంపాపేట ప్రాంతం రాజిరెడ్డి నగర్‌లో యువతి హత్యకు గురైంది. యువతి ఉంటున్న ఇంట్లోనే మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఓ వ్యక్తి భవనం రెండో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు సహజీవనం చేస్తున్నట్టు స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News