- Advertisement -
యంగ్ హీరో రోషన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతంతో కలిసి పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలమ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సంచలనం సృష్టించింది. రోషన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ రోషన్ను స్ట్రాంగ్ విల్ పవర్‌తో వున్న ఇంటెన్స్ ఫుట్‌బాల్ ఆటగాడిగా పరిచయం చేస్తుంది. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడం ఆకట్టుకుంది. అతని పాత్ర ప్రయాణం మైదానంలో, జీవితంలో నిజమైన ఛాంపియన్‌గా ఎదగడానికి చేసే పోరాటంగా ఉండబోతోంది.
- Advertisement -