గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీకి యశస్వి దూరం?
నాగ్‌పూర్: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు టీమిండియాకు గట్టిషాక్ తగిలింది. గాయంతో ఈ మెగా టోర్నీకి స్టార్ ఓపెనర్ దూరంకానున్నట్టు తెలుస్తోంది. చీలమండ గాయంతో స్టార్ ఆటగాడు యశస్వి జైశ్వాల్ జట్టు నుంచి వైదొలుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో విదర్భతో జరగబోయే సెమీ ఫైనల్‌కు ముందు ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే, ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డట్టు, అందుకే సమీస్‌లో తలపడే ముంబై జట్టు నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
కాగా, దీనిపై ఎటువంటి అధికార ప్రకటన ప్రరాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియాలోకి మరో ఆటగాడిని తీసుకోనున్నట్టు, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి యశస్వి జైశ్వాల్‌ను పంపించనున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. అయితే జైశ్వాల్‌ను ఇటీవలనే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి బిసిసిఐ రిలీజ్ చేసింది. అతడిని నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌గా జట్టులోకి తీసుకుంది. కానీ ఇప్పుడు అతడు గాయపడడంతో అతడి స్థానంలో ఎవరికి చోటు కల్పిస్తారనే చర్చలు జోరందుకున్నాయి. కాగా, ముంబై, విదర్భ మధ్య రంజీ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ నేడు(సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు యశస్వీ దూరం కావడంతో ముంబై ఇన్నింగ్స్‌ను ఆయుష్ మాత్రే, త్రేఆకాష్ ఆనంద్‌లతో ప్రారంభించనున్నారు.