Friday, January 10, 2025

పాక్ క్రికెట్ బోర్డుపై ఐసిసి గరంగరం..

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఐసిసి ఛాంపియన్ ట్రోఫీకి మరో 40 రోజుల్లో తెరలేవనుంది. ఆతిధ్య హక్కులు దక్కించుకున్న పిసిబి(పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ఏర్పాట్ల విషయంలో ఆలస్యం చేస్తోంది. మ్యాచులు జరగాల్సిన పాకిస్థాన్‌లోని మూడు వేదికలు గడాఫీ, లాహోర్, కరాచీ స్టేడియాల ఆధునీకికరణ పనులు ఇంకా పూర్తి చేయలేదట. చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాస్తవానికి ఈ పనులన్నీ 2024 డిసెంబర్ 31లోగా పూర్తి కావాల్సి ఉంది. కానీ, సమయం గడుస్తున్నా స్టేడియాల్లో ఇప్పటికీ చాలా పనులు పెండింగ్‌లోనే ఉన్నాయట. దీంతో ఐసిసి రెండో డెడ్‌లైన్ కూడా పెట్టింది. ఈనెల 25 నాటికి అంతా పూర్తి చేయాలని హుకుం జారీ చేసింది. ఫైనల్ డెడ్‌లైన్ ఫ్రిబ్రవరి 12గా విధించింది ఐసిసి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News