Wednesday, December 25, 2024

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

ప్రతిష్ఠాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మంగళవారం విడుదల చేసింది. హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీ వన్డే ఫార్మాట్‌లో జరుగనుంది. టోర్నమెంట్‌లో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ఎలో భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్‌బిలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్ జట్లు పోటీ పడనున్నాయి. మొత్తం 8 జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. మాజీ ప్రపంచ ఛాంపియన్‌లు శ్రీలంక, వెస్టిండీస్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించడంలో విఫలమయ్యాయి. ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ మార్చి 9న జరిగే ఫైనల్‌తో ముగుస్తోంది. ఒకవేళ భారత్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే తుది పోరు దుబాయిలో జరుగుతోంది. టీమిండియా ఫైనల్ చేరడంలో విఫలమైతే టైటిల్ పోరు లాహోర్‌లో నిర్వహిస్తారు.కాగా, భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయిలో నిర్వహించనున్నారు.

మిగతా మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోనే జరుగుతాయి. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే భద్రత కారణాల వల్ల పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు భారత్ నిరాకరించింది. తమకు సంబంధించిన మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు ఐసిసిని కోరింది. కానీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) దీనికి ఒప్పుకోలేదు. దీంతో చాలా రోజుల పాటు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సస్పెన్స్ కొనసాగించింది. కానీ చివరికి ఐసిసి ప్రత్యేక చొరవ చూపించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డును హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు ఒప్పించింది. దీంతో టోర్నీ నిర్వహణపై సందేహాలు తొలగి పోయాయి. కాగా, భవిష్యత్తులో జరిగే ఐసిసి టోర్నీలలో భారత్, పాకిస్థాన్ జట్లకు సంబంధించిన మ్యాచ్‌లు తటస్ఠ వేదికల్లోనే జరుగుతాయి. భారత జట్టు ఐసిసి మ్యాచ్‌ల కోసం పాకిస్థాన్‌కు వెళ్లదు. అదే విధంగా భారత్‌లో పాకిస్థాన్ మ్యాచ్‌లు ఆడదు. రెండు జట్లకు సంబంధించిన మ్యాచ్‌లన్నీ ఇతర దేశాల్లో నిర్వహిస్తారు. ఈ మేరకు పిసిబిబిసిసిఐల మధ్య ఒప్పందం కుదిరింది.

మెగా టోర్నీ షెడ్యూల్ ఇదే..
ఫిబ్రవరి 19: పాకిస్థాన్ x న్యూజిలాండ్‌కరాచి
ఫిబ్రవరి 20 : బంగ్లాదేశ్ x భారత్ దుబాయి
ఫిబ్రవరి 21: అఫ్గానిస్థాన్ x దక్షిణాఫ్రికాకరాచి
ఫిబ్రవరి 22: ఆస్ట్రేలియా x ఇంగ్లండ్ లాహోర్
ఫిబ్రవరి 23: భారత్ x పాకిస్థాన్ దుబాయి
ఫిబ్రవరి 24: బంగ్లాదేశ్ x న్యూజిలాండ్ రావల్పిండి
ఫిబ్రవరి 25: ఆస్ట్రేలియా x దక్షిణాఫ్రికారావల్పిండ్
ఫిబ్రవరి 26: అఫ్గానిస్థాన్ x ఇంగ్లండ్‌లాహోర్
ఫిబ్రవరి 27: పాకిస్థాన్ x బంగ్లాదేశ్‌రావల్పిండి
ఫిబ్రవరి 28: అఫ్గానిస్థాన్ x ఆస్ట్రేలియాలాహోర్
మార్చి 1: దక్షిణాఫ్రికా x ఇంగ్లండ్ కరాచి
మార్చి 2: న్యూజిలాండ్ x భారత్‌దుబాయి
మార్చి 4: తొలి సెమీ ఫైనల్ దుబాయి
మార్చి 5: రెండో సెమీ ఫైనల్ లాహోర్
మార్చి : 9 ఫైనల్‌లాహోర్ (భారత్ ఫైనల్‌కు వెళ్లే దుబాయి).

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News