Tuesday, March 18, 2025

నష్టాలు మిగిల్చిన ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆటగాళ్లకు షాక్!

- Advertisement -
- Advertisement -

ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఓ ఐసిసి ఈవెంట్‌కు ఆతిధ్యం ఇచ్చే అవకాశం పాకిస్థాన్‌కు దక్కింది. ఈ ఏడాది జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి హోస్ట్‌గా వ్యవహరించిన పాక్‌.. అన్ని చేదు అనుభవాలే మూటగట్టుకుంది. ఈ సిరీస్‌లో గ్రూప్‌ స్టేజ్‌ నుంచే వైదొలగడం.. భారత్ ఛాంపియన్ కావడం.. ట్రోఫీ ప్రధానోత్సవంలో పాక్ ప్రతినిధులను పిలవకపోవడం వంటి మింగుడుపడని ఘటనలు ఎన్నో జరిగాయి. అయితే తాజాగా పాకిస్థాన్‌ ఓ తేరుకోలేని సమస్యలో ఇరుక్కుపోయింది.

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన పాక్‌‌కు ఈ టోర్నమెంట్ భారీ ఆర్థిక నష్టాలను అందించింది. ఈ టోర్నమెంట్ కోసం పాకిస్థాన్ 18 బిలియన్ పాకిస్థాన్ రూపాయిలు(58 మిలియన్ డాలర్లు) ఖర్చు చేసిందట. రావల్పిండి, లాహోర్, కరాచీ స్టేడియంల ఆధునికీకరణకు ఈ డబ్బులు వెచ్చిందని స్థానిక మీడియా పేర్కొంది. అంతేకాక.. ఈవెంట్ సన్నహాల కోసం మరో 40 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. దీంతో కానీ, హోస్టింగ్ ఫీజు కింద పాక్ అందుకుంది కేవలం 6 మిలియన్ డాలర్లు మాత్రమే. ఇక టకెట్ అమ్మకాలు, స్పాన్సర్స్ ద్వారా వచ్చిన డబ్బులు చాలా తక్కువే.

దీంతో పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డుకు ఈ టోర్నమెంట్ అక్షరాల 85 మిలియన్ డాలర్ల నష్టం మిగిల్చింది. ఇప్పుడు దీన్ని భర్తీ చేసేందుకు పాక్ బోర్డు ఆటగాళ్లు షాక్ ఇవ్వాలని ఆలోచిస్తుందట. వారి వేతనాల నుంచి భారీగా కోతలు విధించాలనే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. అంతేకాక.. ఆటగాళ్లు 5స్టార్ హోటల్ వసతులను తగ్గించి.. ఎకానమీ హోటల్‌లో సర్దుకోవాలని బోర్డు సూచించనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News