Wednesday, November 27, 2024

హైబ్రిడ్ పద్ధతిలో ఛాంపియన్స్ ట్రోఫీ!

- Advertisement -
- Advertisement -

పిసిబికి ఐసిసి భారీ నజరానా?
దుబాయి: పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది ఐసి సి వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్న విష యం తెలిసిందే. అయితే పాక్ గడ్డపై తాము ఆ డే ప్రసక్తే లేదని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఇప్పటికే ఐసిసికి స్పష్టం చేసింది. ఇక పాకిస్థాన్ కూడా అన్ని మ్యాచ్‌లు కూడా పాక్‌లోనే జరగాలని పట్టుబడుతోంది. ఇలాంటి స్థితిలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. తమ గడ్డపై భారత్ ఆడాల్సిందేనని పి సిసి కోరుతోంది. దీని కోసం బిసిసిఐని ఒప్పించాలని ఐసిసిని కోరింది. భారత్ మాత్రం పాక్ లో ఆడేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లే దు.

తమకు సంబంధించిన మ్యాచ్‌లను పాకిస్థా న్ బయట నిర్వహించాలని బిసిసిఐ డిమాండ్ చేస్తోంది. దీనికి పిసిబి ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. టోర్నీ నిర్వహణ బాధ్యతలునైనా వదులుకుంటామని హైబ్రిడ్ విధానానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో టోర్నీని సాఫీగా నిర్వహించేందుకు ఐసిసి రంగంలోకి దిగింది. దీని కోసం పిసిబి ఒప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైబ్రిడ్ విధానంలో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తే భారీ నగదు పురస్కారాన్ని అందిస్తామని ఐసిసి హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఒకవేళ పిసిబి ఈ ఆఫర్‌కు ఒప్పుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిణపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News