Friday, November 22, 2024

హైబ్రిడ్ విధానంలో ఛాంపియన్స్ ట్రోఫీ?

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ప్రతిష్ఠాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్‌తో సహా 8 దేశాలు పాల్గొననున్నాయి.

అయితే పాకిస్థాన్‌లో భద్రత పరమైన ప్రమాదం పొంచి ఉండడంతో అక్కడ ఆడేందుకు భారత్ నిరాకరిస్తోంది. తాము ఆడే మ్యాచ్‌లను దుబాయ్ లేదా శ్రీలంకలలో నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) సూచిస్తోంది. ఇక బిసిసిఐ ఒప్పించే బాధ్యతను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసిసికి అప్పగించింది. మరోవైపు ఐసిసి మాత్రం హైబ్రిడ్ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహించి సమస్యకు సానుకూల పరిణామం కనుగోవాలని భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News