- Advertisement -
ఆరోగ్య శాఖకు శైలజ దూరం
తిరువనంతపురం: కేరళ శాసనసభా పక్ష నాయకునిగా సిపిఎం సీనియర్ నాయకుడు పినరయి విజయన్ ఎన్నికయ్యారు. దీంతో ఆయన రెండోసారి కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. గత ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసి అందరి మన్ననలు చూరగొన్న కెకె శైలజకు కొత్త క్యాబినెట్‌లో స్థానం దక్కలేదు. సిపిఎం నుంచి 11 కొత్త ముఖాలకు క్యాబినెట్‌లో స్థానం కల్పించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ మంగళవారం నాడిక్కడి పార్టీ ప్రధాన కార్యాలయం ఎకెజి సెంటర్‌లో సమావేశమై అసెంబ్లీలో పార్టీ సారథిగా పినరయి విజయన్‌ను ఎన్నుకుంది. గతంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసిన శైలజా టీచర్‌కు పార్టీ విప్ బాధ్యతలు అప్పగించాలని పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించినట్లు సిపిఎం ఒక ప్రకటనలో తెలిపింది.
- Advertisement -